ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూత

అర్థరాత్రి దాటిన తర్వాత బడేటి బుజ్జికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూత. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కీలక నేతగా వ్యవహరిస్తున్న బుజ్జి. గత ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి.

ఏలూరు :  టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. కాగా, బుజ్జి 2014లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 


బడేటి బుజ్జి గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. తర్వాత 2009లో ప్రజారాజ్యంలో చేరి.. ఆ పార్టీ తరపున ఏలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరి 2014లో ఏలూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. గత ఎన్నికల్లో తిరిగి అక్కడ నుంచే పోటీచేసిన ఆయన 4072ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) చేతిలో ఓడారు. బడేటి బుజ్జి దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు.

6 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్