స్వాతిరెడ్డి అరెస్ట్‌, జైలుకు తరలింపు


సాక్షి, నాగర్‌కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్‌రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం) అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. కాగా, నాగర్‌ కర్నూల్‌ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి ...కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్‌లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయగా కొంతకాలం జైలులో ఉంది.


2018 జూలైలో బెయిల్‌పై వచ్చిన స్వాతి మహబూబ్‌నగర్‌ స్టేట్‌ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్‌కర్నూల్‌జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి రవికుమార్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. దీంతో స్టేట్‌ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్‌ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించారు.


స్వాతిరెడ్డి జామీను ఉపసంహరణ:

ప్రియుడితో కలసి భర్తను హత్య చే సిన స్వాతి ఉదంతం మరో మలుపు తిరిగింది. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు దానిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్‌రెడ్డిని ఆయన భార్య స్వాతి, తన ప్రియుడు రాజేశ్‌తో కలసి హత్య చేయగా డిసెంబర్‌లో ఈ విషయం బయటపడింది.

అప్పటి నుంచి స్వాతి మహబూబ్‌నగర్, రాజేశ్‌ నాగర్‌కర్నూల్‌ జైల్లో ఉంటున్నారు. గత నెల 16న స్వాతికి మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో బెయిల్‌ లభించగా పూచీకత్తు ఇచ్చే వారెవరూ లేకపోవడంతో ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తితోపాటు మరొకరు ఆమెకు జామీను ఇవ్వగా గత నెల 27న జైలు నుంచి విడుదలైంది.

స్వాతిని తీసుకువెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో అధికారులు మహబూబ్‌నగర్‌లోని రాష్ట్ర సదనానికి తరలించారు. పోలీసులు శుక్రవారం ఆమెను నాగర్‌కర్నూల్‌ కోర్టులో హాజరుపర్చారు. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్ద రు  న్యాయస్థానం ముందుకు వచ్చి తమ పూచీకత్తును ఉపసంహరించుకుంటున్నామని న్యాయమూర్తికి విన్నవించారు. ఈ అంశంపై కోర్టు 7వ తేదీ వరకు గడువు పెట్టింది.


Swathi Reddy who brutally killed her husband with the help of paramour in November 2017 has been sent to 14-day judicial remand to Mahbubnagar jail. She was arrested by the police on Tuesday. She was granted bail in 2018 and was staying at State Home. However, after she failed to appear for the case hearings. The fourth class fast track court magistrate Ravi Kumar has issued a non-bailable warrant against Swathi Reddy.


wati Reddy killed her husband after she developed an affair with one Rajesh. The duo killed Sudhakar Reddy and later Rajesh disfigured his face to get the face of Sudhakar through plastic surgery. However, the police unfolded their plan and arrested the two.

12 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్