అరకు విహారయాత్రలో విషాదం..

విశాఖపట్నం : అరకులో విషాదం చోటుచేసుకుంది. భీమవరం డీఎన్ఆర్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు ఆదివారం కావడంతో.. అరకు అందాలు తిలకించడానికి విహారయాత్రకు వచ్చారు. ప్రముఖ సందర్శక ప్రాంతమైన బొర్రా గృహాలు రైల్వే గేట్ వద్ద ప్రమాదవశాత్తు పర్యాటక బస్సులో నుంచి ఓ యువకుడు కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే పర్యాటక బస్సు అతనిపై నుంచి దూసుకుని పోయింది. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థుల విహారయాత్రంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

25 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్