జనసేన పార్టీ కార్యకర్తతో నాకు ఇబ్బందిగా ఉంది:పవన్‌ కల్యాణ్‌ అసహనం


మండపేట: ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ జనసేన పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అసహనం వ‍్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో నిన్న (ఆదివారం) ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు అండ్‌ బాబు కన్వెన్షన్‌ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్‌ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు.

దీంతో పవన్‌ స్పందిస్తూ...కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అవరొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల మొదటి మూడు రోజుల్లోగా ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించకుంటే కాకినాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. 

41 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్