వైఎస్సార్‌ సీపీలో చేరిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు


తాడేపల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రంగరాజుతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు కూడా పార్టీలో చేరారు. అనంతరం రంగరాజు మీడియాతో మాట్లాడుతూ... ‘వైఎస్‌ జగన్‌ పాలన అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వంలో పని చేయడం అదృష్టం. ఈ పార్టీలో నేను కొత్తవాడిని అనుకోవడం లేదు. వైఎస్సార్‌ సీపీలో అందరూ మా వాళ్లే ఉన్నారు. పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్‌ సీపీలో చేరాను’ అని తెలిపారు. 


గోకరాజు రామరాజు మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాను. ఇవాళ వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో సొంతగూటికి చేరారని తెలిపారు.  సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు అమితంగా ఆకర్షించాయని, వైఎస్సార్‌ అంటే అమితమైన అభిమానం అని నరసింహరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నేత పీవీఎల్‌ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.


#GokarajuRangaraju


6 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్