పులి ఆవును భక్షిస్తే ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించారు?


పనాజీ : పులుల సంహారంపై గోవా అసెంబ్లీ చర్చిస్తున్న క్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్‌ అలెమావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


మనుషులు ఆవులను తింటే శిక్షిస్తున్న తరహాలోనే ఆవులను భక్షించే పులులను కూడా శిక్షించాలని ఆయన వ్యాఖ్యానించారు. గత నెలలో మహాధాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పులిని దాని పిల్లలను స్ధానికులు చంపిన అంశాన్ని గోవా అసెంబ్లీలో విపక్ష నేత దిగంబర్‌ కామత్‌ ప్రస్తావించారు.


ఈ దశలో అలెమావో జోక్యం చేసుకుని పులి ఆవును భక్షిస్తే ఏ శిక్ష విధిస్తారని ప్రశ్నించారు. మనిషి ఆవును తింటే శిక్షిస్తున్నారు..మరి వన్యప్రాణుల విషయంలో పులులు ప్రాధాన్యమైతే..మనుషులకు సంబంధించి ఆవులకే ప్రాధాన్యం అంటూ అలెమావో అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మనిషి కోణంలో ఆలోచించడాన్ని విస్మరించరాదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఈ అంశంపై స్పందిస్తూ పులి పిల్లలు తమ పశుసంతతిపై దాడి చేయడంతో స్ధానికులు వాటిని చంపారని చెప్పారు. జంతువుల దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు మూడు నాలుగురోజుల్లో పరిహారం అందచేస్తామని ఆయన వెల్లడించారు.

1 view0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్