ఈ లుచ్చా రాజకీయాల మీద తిరగబడు...ఈ లుచ్చా రాజకీయాల మీద తిరగబడు...

ఆ రోజు 11 జూన్ 2017. ఒక 17 ఏళ్ళ బాలిక ఉద్యొగం కోసమని కొందరిని నమ్మి కాన్పూర్ వెళ్ళింది. అక్కడ ఆ తీసుకెళ్ళినోళ్లు, మరికొంతమంది కలిసి ఆమెను అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఆమెను 60 వేల రూపాయలకు ఇంకొకడికి అమ్మేశారు. ది. 20 జూన్ 2017న ఆమె ఎలాగోలా తప్పించుకొని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వగా FIR నమోదైంది. ఆ తర్వాత పరిణామాలలో తెలిసిందేందంటే గ్యాంగ్ రేప్ కు ముందు అంటే 4 జూన్ 2017న ఆమెను అక్కడి బీజేపీ శాసన సభ్యుడు కుల్దీప్ సింగ్ సెనెగర్ ఇంటికి ఉద్యోగం కోసమని వెళితే తన పై అత్యాచారం అత్యాచారం చేసాడని తెలిపింది. ఈ విషయం ఆమె 17 ఆగష్టు 2017 న యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ కు ఉత్తరం రాసి తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె ఆ MLA పై కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఆ MLA పేరు FIR లో చేర్చడానికి ఒప్పుకోలేదు. బహుశా ఉప్పుతిన్న విశ్వాసం కాబోలు. ఆ తర్వాత 5 ఎప్రిల్ 2018 న ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అంటే సుమారు 8 నెలలపాటు నిందితుల పై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు 8 నెలల తర్వాత ఆమె తండ్రిని అరెస్టు చేశారు. కారణం ఏంటో ఎవ్వరికి తెలీదు. అన్యాయంగా తండ్రిని అరెస్టు చేసినందుకు నిరసనగా ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఇంటిముందు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆమె. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కట్ చేస్తే 9 ఏప్రిల్ 2018న ఆమె తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చనిపోయాడు. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి పై ఆ MLA తాలుకు వ్యక్తులు స్టేషన్ కి వచ్చి మరీ అతన్ని కొట్టి, హింసించి చంపేసారు. 13 ఏప్రిల్ 2018న ఆ MLA ని సిబిఐ ఇంక్వయరి చేసి కోర్టు ఆదేశాల ప్రకారం అతనిని అరెస్టు చేసి 7 రోజులు రిమాండుకు పంపారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మేనమామ న్యాయం కోసం అక్కడ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తే, ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం అతని పై ఉన్న నాటు తుపాకీ కేసు ఒకటి రీ ఓపెన్ చేసి అతన్ని కూడా అరెస్టు చేశారు. అంతకు ముందే అతని సోదరుణ్ణి కూడా లాకప్ డెత్ చేశారు పోలీసులు. విస్మయం గొలిపే విషయం ఏంటంటే ఆమె చెప్పిన అన్ని వివరాలను పలుసార్లు అక్కడి జ్యూడిసియల్ మేజిస్ట్రేట్ సమక్షంలోనే చెప్పింది. వాళ్ళు రావడం ఆమె చెప్పిన వివరాలు రాసుకోవడం తప్ప ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం రక్షణ కూడా దొరకలేదు. జరుగుతున్న ఘటనలను గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లెటరు కూడా రాసింది ఆ అభాగ్యురాలు. బాధితురాలికి రక్షణ లేదని భావించిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధం ఉన్న 5 కేసులను ఢిల్లీలోని ఒక కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆర్డర్ వేసింది. 25 లక్షలు నష్ట పరిహారం కూడా ఆదేశించింది. కానీ ఆలకించేదెవరు, కోర్టు ఆదేశాలను అమలు చేసేదెవరు. ఆమెకు గాని ఆమె కుటుంబానికి గాని ఎలాంటి రక్షణ కల్పించలేదు ఆదిత్యనాధ్ ప్రభుత్వం. 28 జులై 2019వ తేదీన ఆమె తన కుటుంబ సంభ్యులతో వెళుతున్న కారును కొందరు దుండగులు ఒక ట్రక్కులో వెంబడించి కారును ఢీకొట్టారు. ఆమె ఎలాగో చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడింది కానీ తనకు తోడుగా కారులో ఉన్న ఇద్దరు కుటుంబ సంభ్యులు మాత్రం చనిపోయారు. దేశ వ్యాప్తంగా ఈ సంఘటనల పై ప్రజలు, వివిధ సంఘాలు ఆందోళనలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆమె పోరాటానికి కొంతలో కొంతగా నేరస్థులకు ఉచ్చు బిగుస్తున్న తరుణంలో చివరికి మొన్నటి 5 డిసెంబర్ 2019న ఆమె కోర్టుకు వెళుతుండగా రోడ్డుపై ఆమెను వెంబడించిన కొందరు (ఇంకెవ్వరు ఆ MLA మనుషులు) ఆమె పై పెట్రోల్ పోసి సజీవంగా తగలబెట్టారు. మంటలు అంటుకున్న శరీరంతోటె సుమారు కిలోమీటరుకు పైగా పరిగెత్తి ఒక చోటి నుండి పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగలిగింది.అంబులెన్స్ కు కూడా ఆమె ఫోన్ చేసుకుని, అందులో ఎక్కి ధైర్యంగా ఆసుపత్రికి వెల్లింది.మేజిస్ట్రేట్ కి వాంగ్మూల్లం ఇచ్చింది.నేను సాక్ష్యం చెప్పాలి,దోషులకు శిక్ష పడాలి ,నన్ను బ్రతికించండీ అంటూ డాక్టర్స్ ను బ్రతిమాలి ఒకటిన్నర రోజులపాటు 90 శాతం కలిన శరీరంతో మృత్యువుతో పోరాడుతూ 6వ తేదీన కన్నుమూసింది. ఆవిధంగా ఆమె కేసుకు ముగింపు పలికారు అక్కడి పోలీసులు, అధికార పార్టీ కలిసి. 17 ఏళ్ల వయస్సు. అందరిలాగే జీవితం, పెళ్లి, కుటుంబం లాంటి విషయాల పై ఎన్నో కలలుగంటూ ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఆమెను దుర్మార్గంగా రేప్ చెయ్యడమే గాక, ఆమె తండ్రిని, ఇద్దరు మామయ్యలను, మరో ఇద్దరు కుటుంబ సభ్యులను చంపి, ఈమెను ట్రక్కుతో గుద్ది చంపే ప్రయత్నం చేసి, చివరికి 19 ఏళ్ల వయస్సులో పెట్రోల్ మంటల్లో ఆమె కలిపోవడం గుండెలు పగిలేలా చేస్తుంది. ఎందుకు ఆమె జీవితం ఇలా అయిపోయింది. దీనికి కారకులెవరు? దేశంలో ఇలాంటి సంఘటనలు డబ్బు, అధికారం, రాజకీయ నేతల అండదండలతో జరుగుతుంటే ప్రజలు మీడియా ఎందుకు పెద్ద ఎత్తున నిరసనలు తెలపటం లేదు... నీ ఇంట్లో రేపు ఇదే జరిగితే??? అందుకే లే ఇప్పుడైనా నిద్ర లే.... ఈ లుచ్చా రాజకీయాల మీద తిరగబడు... లే నిధ్రలే... ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం...✊✊✊✊✊✊

2 views0 comments

Recent Posts

See All

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్